హైదరాబాద్‌లో హిట్-అండ్-రన్: మూడేళ్ల బాలుడు స్పాట్ డెడ్

20-09-2026 | 09:21am

హైదరాబాద్: ఐ.ఎస్. సదన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల సంతోష్ నగర్ ఎక్స్ రోడ్(Santosh Nagar X Road) వద్ద స్వీకార్ హోటల్ సమీపంలో జరిగిన 'హిట్ అండ్ రన్' ప్రమాదంలో మూడేళ్ల బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. నివేదికల ప్రకారం, మృతుడిని ఇజాన్‌గా గుర్తించారు. అతను తన తండ్రితో కలిసి బయటకు వెళ్లినట్లు సమాచారం. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో బాలుడు రోడ్డుపై పరుగెత్తడంతో బైకును తప్పించుకున్నారు. కానీ అటుగా వస్తున్న కారు బాలుడిని వేగంగా ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాలుడు అక్కడికక్కడే మరణించాడు. వాహన డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, పోస్టుమార్టం నిమిత్తం బాలుడి మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఆ డ్రైవర్‌ను గుర్తించేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు, అలాగే వాహనం, దాని డ్రైవర్‌ను గుర్తించడానికి సీసీటీవీ (CCTV) దృశ్యాలను పరిశీలిస్తున్నారు.


మరిన్ని వార్తలు