అక్టోబర్ ఆఖరున కల్ట్
మాస్ కా దాస్ విశ్వక్సేన్(Vishwak Sen) నుంచి వస్తున్న తాజాచిత్రం ‘కల్ట్’(Cult). విశ్వక్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తూ దర్శకత్వం, కథ, స్క్రీన్‌ప్లే బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్నారు. తరుణ్ భాస్కర్(Tharun Bhascker) డైలాగ్స్ అందించిన ఈ చిత్రంలో గాయత్రి భరద్వాజ్, తారక్ పొన్నప్ప, మురళీశర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, కార్తికేయ, అనిరుధ్ భాస్కర్, యజ్ఞ తుర్లపాటి, కబీర్ భారతీయ, విశాఖ్ నాయర్, చెపూరి వివేక్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
తారక్ సినిమాస్ బ్యానర్‌పై సందీప్ కాకర్ల నిర్మిస్తున్న ఈ మూవీ రిలీజ్ డేట్‌ను మేకర్స్ తాజాగా గ్లింప్స్ ద్వారా ప్రకటించారు. అక్టోబర్ 30న ఈ సినిమా తెలుగు, హిందీ, ఇంగ్లిష్, జపనీస్, స్పానిష్ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. సంగీతం: రవి బస్రూర్; డీవోపీ: అరవింద్ విశ్వనాథన్; ఎడిటర్: రవితేజ గిరిజాల; ప్రొడక్షన్ డిజైన్: అరవింద్ మూలే.