హైదరాబాద్‌లో ‘క్యూరాపాడ్ ఎక్స్‌పీరియన్స్’

18-09-2026 | 05:10am

మహిళల పీరియడ్ నొప్పికి డ్రగ్-ఫ్రీ వైద్య పరిష్కారం  

హైదరాబాద్, సెప్టెంబర్ 16 (విజయక్రాంతి): మహిళల్లో పీరియడ్స్ సమయంలో ఎదురయ్యే నొప్పికి ఆధునిక, డ్రగ్-ఫ్రీ పరిష్కారాన్ని (Drug-free solution) అందించే లక్ష్యంతో రూపొందించిన క్యూరాపాడ్ (Curapod) ఎం వైద్య పరికరాన్ని హైదరాబాద్‌లో ఐటీసీ కోహెనూర్(ITC Kohinoor), ఆవిష్కరించారు. మహిళలు పరికరం పనితీరును స్వయంగా అర్థం చేసుకునేందుకు రూపొందించిన ‘క్యూరాపాడ్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను కూడా ప్రారంభించనున్నారు. క్యూరాపాడ్ ఎం అనేది మహిళలు దుస్తుల కింద పొత్తికడుపు దిగువ భాగంలో ధరించగలిగే వైద్య పరికరం.

ఇందులో మందులు లేదా హార్మోన్లు ఉండవు. పరికరం 30 నిమిషాల సెషన్లలో ఆటోమేటిక్ షట్‌ఆఫ్ సదుపాయంతో పనిచేస్తుంది. వైద్య విద్యావేత్త డాక్టర్ తనయ నరేంద్ర (డాక్టర్ క్యూటెరస్), వీ3 వెంచర్స్ సహ వ్యవస్థాపకుడు అర్జున్ వైద్య, ఫౌంటెన్హెడ్ గ్లోబల్ స్కూల్ చైర్పర్సన్ మేఘనా ముసునూరి ఈ చర్చలో పాల్గొననున్నారు. మహిళలు పరికరాన్ని ధరించి దాని సాంకేతికతను తెలుసుకోవడంతో పాటు, గైనకాలజిస్టులను వ్యక్తిగతంగా ప్రశ్నలు అడిగే అవకాశం కూడా కల్పించనున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమం అనంతరం సందర్శకుల కోసం అందుబాటులో ఉంటుంది. 

మరిన్ని వార్తలు