6 September, 2026 | 8:33 AM

కొలువుల కోత

06-09-2026 | 05:30am

ప్రపంచవ్యాప్తంగా గత కొంతకాలంగా బహుళజాతి సంస్థల్లో లే ఆఫ్‌(Layoff,)ల సంస్కృతి విస్తృతమవుతుండటం కలవరపెడుతున్నది. వ్యయాలను తగ్గించుకునే నెపంతో పెద్ద ఎత్తున ఉద్యోగుల(employees)ను తొలగిస్తుండటం ఆందోళన కలిగిస్తున్నది. ఇటీవల ఒరాకిల్ సంస్థ(Oracle company) వేలాది మందిని విధుల నుంచి తప్పించగా, తాజాగా ఫోక్స్ వ్యాగన్(Volkswagen) ఒక్క కలం పోటుతో లక్ష కుటుంబాల తలరాతను తలకిందులు చేయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నది.

పెద్ద సంస్థల్లోనే పరిస్థితి ఇలా ఉంటే, ఇక ఎంఎస్‌ఎంఈలు, చిన్న చిన్న కంపెనీల్లో పరిస్థితుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మరోవైపు విదేశాల్లో ఉద్యోగాలు కోల్పోయిన భారతీయులు(Indians) తిరిగి స్వదేశం బాటపడుతుండటంతో దేశీయ ఉపాధి మార్కెట్‌(domestic job market)పై అదనపు ఒత్తిడి పడుతున్నది. ఇప్పటికే మన దేశంలో నిరుద్యోగ సమస్య తా రస్థాయికి చేరుకున్న విషయం విదితమే. ఉపాధి(employment), ఉద్యోగ అవకాశాల( job opportunities) కోసం యువత ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు.

కాగా, ఓ వ్యక్తి ఉద్యో గం కోల్పోవడమంటే ఒక కుటుంబం రోడ్డున పడినట్టే. ఒక్కసారిగా ఆదా యం నిలిచిపోయి రోజూవారీ కుటుంబ అవసరాలు, పిల్లల చదువులు, రుణ ఈఎంఐలతో అనేక కుటుంబాలు సతమతమవుతున్నారు. మూలిగే నక్కపై తాడికాయ పడ్డ చందంగా పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధర లు సామాన్యులకు కనీసం ఒక్క పూట తిండికి నోచుకోకుండా చేస్తున్నా యి. తత్ఫలితంగా ప్రజల కొనుగోలు శక్తి పడిపోతున్నది.

అది ప్రత్యక్షంగా వ్యాపార, వాణిజ్యాలపై ప్రభావం చూపి, పరోక్షంగా ఉపాధిరంగాన్ని తీ వ్రంగా దెబ్బతీస్తున్నది. కాగా, బహుళజాతి సంస్థల్లో లే ఆఫ్‌లకు ఏఐ ఒక్క టే కారణమని చెప్పలేం. అంతర్జాతీయ సంక్షోభ పరిస్థితులు కూడా అందుకు ఆజ్యం పోస్తున్నాయి. అయితే, అన్నింటికి ఏఐని నిందించడం కంటే, ఆ సాంకేతికతతోపాటు ముందుకుసాగితేనే మనుగడ సాగించగలమని గ్రహించాలి. గతంలో కంప్యూటర్ల ను ఆవిష్కరించినప్పుడు కూడా సాంప్రదాయ ఉద్యోగాలు కనుమరుగవుతాయనే భయం వెంటాడింది.

కానీ, కంప్యూటర్ల రాకతో కొన్ని పాత ఉద్యో గాలు తగ్గినప్పటికీ, అనేక కొత్త కొలువుల సృష్టి కూడా జరిగింది. ఇప్పుడు కూడా ఏఐ మూలంగా ఉద్యోగాల స్వరూపం మారుతున్నప్పటికీ, అదే సమయంలో ఏఐ ప్రాంప్ట్ ఇంజినీరింగ్ వంటి సరికొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తున్నాయనే వాస్తవాన్ని విస్మరించకూడదు. ఈ నేపథ్యంలో మారుతు న్న పరిస్థితులకు అనుగుణంగా మనమూ మారాల్సిన ఆవశ్యకత ఉన్నది. 

మరిన్ని వార్తలు