calender_icon.png 19 April, 2025 | 10:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Editorial

article_89687948.webp
ఇది సమంజసమేనా!

19-04-2025

దేశంలోనే అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టుపై ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ ఇంతెత్తున లేచారు. బిల్లుల ఆమోదం విషయంలో గవర్నర్లు, రాష్ట్రపతికి సుప్రీంకోర్టు గడువు నిర్దేశించడమే ఇందుకు కారణం. పరిశీలన నిమిత్తం గవర్నర్లు పంపిన బిల్లులపై మూడు నెలల గడువులోగా రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవాలని తమిళనాడు ప్రభుత్వం వర్సెస్ గవర్నర్ ఆర్.ఎన్ రవి కేసులో సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు వెలువరించింది. ఈ తీర్పు ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్‌కు కోపం తెప్పించింది. అత్యున్నత న్యాయస్థానం తన పరిధి దాటి వ్యవహరించిందని, రాష్ట్రపతిని సుప్రీంకోర్టు ఆదేశించలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.