19 August, 2026 | 9:35 PM

కొండగట్టు దేవస్థానంలో రెండు రోజులు దర్శనాలు రద్దు

19-08-2026 08:36 PM

కొడిమ్యాల,(విజయక్రాంతి): జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానంలో గర్భాలయ మరమ్మతు పనులు జరుగుచున్నందున 20, 21 తేదీలలో రెండు రోజుల పాటు అంతరాలయ దర్శనములు రద్దు చేయబడినది. తిరిగి 22 తేదీ (శనివారం) రోజున అంతరాలయ దర్శనములు పునఃప్రారంభించబడునని ఆలయ ఈవో అంజనా రెడ్డి తెలిపారు.