6 September, 2026 | 6:12 PM

ఉద్యోగుల డిమాండ్లపై సర్కార్ చర్చలు.. కొలిక్కి వస్తుందా..?

06-09-2026 | 04:52pm

హైదరాబాద్: ప్రజాభవన్‌(Praja Bhavan)లో ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో కాసేపట్లో చర్చలు జరపనున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka). ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు, పెండింగ్‌లో ఉన్న డిమాండ్లపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.

తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలంటూ ఉద్యోగ సంఘాలు కొంతకాలంగా ఆందోళనలు కొనసాగిస్తున్నాయి. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు కోరుతున్నారు.

ఈనెల 10న చలో హైదరాబాద్‌కు ఉద్యోగ జేఏసీ పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం, ఉద్యోగ సంఘాల మధ్య జరగనున్న చర్చలకు ప్రాధాన్యం ఏర్పడింది. ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తమ డిమాండ్లను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దృష్టికి తీసుకెళ్లనున్నారు. చర్చల అనంతరం ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీలు లభిస్తాయనే దానిపై ఉద్యోగ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

మరిన్ని వార్తలు