ఆరోగ్యం పై ప్రతి ఒక్కరు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి

03-10-2026 | 11:35pm

 అస్వస్థతకు గురైన సుందరచారిని పరమర్శించిన ఎమ్మెస్సార్ 

 జర్నలిస్టుల సంక్షేమ సంఘం ద్వారా సహాయాన్ని అందించి ధైర్యాన్ని చెప్పిన డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి

మహబూబ్ నగర్ (విజయక్రాంతి) : ఆరోగ్యం పై ప్రతి జర్నలిస్టు(Journalist) ప్రత్యేక శ్రద్ధ వహించవలసిన అవసరం ఎంతైనా ఉందని డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి(Deputy Mayor Marepalli Surender Reddy) అన్నారు. శనివారం అకస్మాత్తుగా జర్నలిస్టు సుందరాచారి అస్వస్థతకు గురి కావడంతో మల్లిక ఆసుపత్రి నందు చేర్పించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి వెంటనే ఆసుపత్రికి చేరుకొని సుందర చారిని పరామర్శించారు. వారి ఆరోగ్యం పై సంబంధిత వైద్యులతో ప్రత్యేకంగా మాట్లాడి మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు.

పాలమూరు జర్నలిస్టుల సంక్షేమ సంఘం(Journalists Welfare Association) ద్వారా సమకూర్చిన సహాయాన్ని డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి అందించారు. ధైర్యంగా ఉండాలని జర్నలిస్టులకు ఎప్పుడు ఏ ఆపద వచ్చిన అండగా ఉంటామని స్పష్టం చేశారు. జర్నలిస్టుకు ఆరోగ్యం బాగాలేదని తెలిసిన వెంటనే స్పందించిన దీప్తి మేయర్ ఎమ్మెస్సార్ కు జర్నలిస్టులు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలమూరు జర్నలిస్టుల సంక్షేమ సంఘం ప్రతినిధులు జర్నలిస్టులు ఉన్నారు.

మరిన్ని వార్తలు