రెండు కోట్ల 36 లక్షల నిధులతో పెండ్ పెల్లి అభివృద్ధి
భైంసా సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): కోటీ 36 లక్షల రూపాయల నిధులతో చేపట్టిన పనులను భైంసా మండలంలోని పెండ్ పెల్లి గ్రామంలో సోమవారం ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్(MLA Pawar Ramarao Patel) ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమనికి హాజరైన ఎమ్మెల్యేకు ఘన స్వాగతం లభించింది. మహిళలు మంగళ హరతులతో పూలు చల్లుతు, డప్పు చప్పుళ్లతో చేపట్టిన స్వాగత కార్యక్రమం పండుగ వాతవారణాన్ని తలపించింది.
30 లక్షల నిధులతో నిర్మించిన పాఠశాల ప్రహరీ గోడ, 20 లక్షల నిధులతో మహిళ సమైక్య భవనం, 57 లక్షల నిధులతో సిసి రోడ్లు, డ్రైనేజీ 14 లక్షల నిధులు, 7 లక్షల నిధులతో అమ్మ ఆదర్శ పాఠశాల, కోటీ రూపాయల నిధులతో బిటి రోడు నిర్మాణం పూర్తి కావడంతో ఆ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ మాట్లాడుతూ గ్రామల అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతానన్నారు. మహిళలు మరింత ఆర్థికంగా ఎదగాలని సూచించారు. సర్పంచ్ శ్రీనివాస్ మాట్లాడుతూ తమ గ్రామానికి కోటీ 36 లక్షల రూపాయల నిధులు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు.