మరింత వ్యూహాత్మక మైత్రి
భారత్- మధ్య సమగ్ర గ్లోబల్ స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్‌పై ఫోకస్
ఫోన్లో ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించిన ప్రధాని మోదీ, ట్రంప్
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 30: భారత్-, అమెరికా దేశాల మధ్య సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యం (సమగ్ర గ్లోబల్ స్ట్రాటజిక్ పార్టనర్షిప్) మరింత బలోపేతం చేసుకునేందుకు ప్రధాని నరేంద్రమోదీ(PM Narendra Modi), అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(US President Donald Trump) అంగీకరించారు. ద్వైపాక్షిక సంబంధాలలో పురోగతిని సమీక్షించేందుకు మోదీ బుధవారం ట్రంప్‌తో టెలిఫోన్‌లో మాట్లాడుకున్నారు.
ఈ చర్చలో వాణిజ్యం, రక్షణ, ఇంధనంతో సహా పరస్పర ఆసక్తి ఉన్న ప్రధాన రంగాలు, వ్యూహాత్మక సహకారంపై దృష్టి సారించారు. ‘లిండ్సే ఓ గ్రాహం శాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్ ఆఫ్ 2026’ అమల్లోకి వచ్చిన తర్వాత పెరిగిన వాణిజ్య ఘర్షణల నేపథ్యంలో ఇరుదేశాధినేతలు చర్చించుకోవ డం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ చట్టం, రష్యా చమురు, గ్యాస్‌ను కొనుగోలు చేసే భారత్, చైనాతో సహా ఇతర దేశాలపై 100 శాతం వరకు సుంకాలను విధించడానికి అధికారం ఇస్తుంది.
ప్రధానమంత్రి కార్యాలయం జారీ చేసిన ప్రకటన ప్రకారం.. ప్రధాని మోదీ, అధ్యక్షుడు ట్రంప్ ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. అలాగే ప్రపంచ శాంతి, భద్రతలను ప్రోత్సహించేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై చర్చించారు. భారత్- సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు తమ నిబద్ధతను ఇద్దరు నాయకులు పునరుద్ఘాటించారు. ఇరు దేశాల ప్రజల ప్రయోజనం కోసం సహకారాన్ని మరింతగా పెంపొందించుకోవ డానికి సన్నిహిత సంబంధాలను కొనసాగించడానికి అంగీకరించారు.
వాణిజ్యం, రక్షణ, ఇంధనం, కీలక సాంకేతికత లు, పరస్పర ఆసక్తి ఉన్న ఇతర రంగాలలో ద్వైపాక్షిక సహకారంలో సాధించిన పురోగతిని కూడా సమీక్షించారు. ట్రంప్‌తో తాను ఫలవంతమైన సంభాషణ జరిపినట్లు మోదీ ఎక్స్‌లో పోస్టు చేశారు. విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ ఇటీవల న్యూయార్క్లో జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం సందర్భంగా అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోను కలిశారు. ఈ చర్చల్లో రష్యా, ఇరాన్లపై ఆంక్షల చట్టం (ఎస్‌ఆర్‌ఐఏ)కు సంబంధించిన భారతదేశ ఆందోళనలు ప్రస్తావనకు వచ్చాయి.
వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రస్తుతం జీ20 వాణిజ్య మంత్రుల సమావేశం కోసం అమెరికాలో ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా, ఆయన అమెరికా వాణిజ్య ప్రతినిధి జేమిసన్ గ్రీర్‌తో సమావేశం కానున్నారు. భారత్ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాన్ని (బీటీఏ) ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలలో భాగంగా, అలాగే ఫిబ్రవరి 7, 2026 నాటి ఉమ్మడి ప్రకటనకు అనుగుణంగా మధ్యంతర ఒప్పందాన్ని ఖరారు చేసే దిశగా గోయల్ ఆయనతో ద్వైపాక్షిక చర్చలు జరుపనున్నారు.