6 September, 2026 | 8:35 AM

మృతుల కుటుంబ సభ్యులకు చెక్కుల పంపిణీ

06-09-2026 | 05:10am

హైదరాబాద్, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి): అదనపు ప్రధాన న్యాయమూర్తి, సిటీ సివిల్ కోర్టులో రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందిన కుటుంబ సభ్యులకు నష్ట పరిహారపు చెక్కులు పంపిణీ చేశారు. జూలై ౬, 2016లో ఒడిశా రాష్ట్రం గోపాల్‌నా థ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఎం.నరేంద్ర కుమార్, ఎం.రవికుమార్ మృతి చెందా డు.

దీంతో మృతుని భార్య ఎం.నిఖిత, ఇతర కుటుంబ సభ్యులు మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 166 కింద  ట్రక్ యజమాని, డ్రైవర్‌తో పాటు శ్రీరామ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్‌పై పిటిషన్ల దాఖలు చేశారు. తమకు నష్టపరిహారంగా పరిహారంగా రూ. కోటి 75 లక్షలు, రూ.10కోట్లు చెల్లించాల్సిందిగా వేర్వేరుగా పిటిషన్ దాఖలు చేశారు.

ఈ కేసులో శ్రీరామ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ తరఫున ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అశ్విని ధన్వంత్, జనరల్ మేనేజర్(లీగల్) వినీత్ సొలంకి, వారి న్యాయవాది బి. పాపారెడ్డి చర్చల్లో పాల్గొని ఇరుపక్షాల సమ్మతితో నరేంద్రకుమార్ మృతి చెందిన కేసులో కోటి 75లక్షల రూపాయలు, రవికుమార్ మరణించిన కేసులో రూ.ఐదు కోట్లు ఇచ్చేలా రాజీ కుదిరేలా చేశారు. ఆ చెక్కు లను ప్రధాన న్యాయమూర్తి, సిటీ సివిల్ కోర్టు సమక్షంలో మృతుడి కుటుంబ సభ్యులకు అందజేశారు.   

మరిన్ని వార్తలు