సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ
30-09-2026 | 11:57pm
ములకలపల్లి,(విజయక్రాంతి): తిమ్మంపేట గ్రామానికి చెందిన పుప్పాల రమాదేవి ఆరోగ్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) ద్వారా మంజూరైన రూ.16,000/- చెక్కును ములకలపల్లి మండల అధ్యక్షులు ఎండీ జహీరుద్దీన్ బుధవారం అందజేశారు.ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తున్న CMRF సహాయనిధి ఎంతో అండగా నిలుస్తుందని ఈ సందర్భంగా నాయకులు తెలిపారు.ప్రజల అవసరాలను గుర్తించి,వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా సహాయం అందేలా కృషి చేస్తున్న ఎమ్మెల్యే జారే ఆదినారాయణకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో తిమ్మంపేట గ్రామ అధ్యక్షులు డాక్టర్ వెంకటేశ్వర్లు గారు,BLA కోఆర్డినేటర్ సురభి రాజేష్,మండల నాయకులు శనగపాటి రవి,మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ సోయం నాగరాజు, పుప్పాల సునీల్, కటికనేని ఆదిత్య తదితరులు పాల్గొన్నారు.