రూ.6.40 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

21-09-2026 | 05:30pm

అశ్వాపురం, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): అశ్వాపురం మండలానికి చెందిన పలువురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి(CMRF) ద్వారా మంజూరైన రూ.6 లక్షల 40 వేల విలువైన చెక్కులను పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు(MLA Payam Venkateswarlu) సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆపదలో ఉన్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు వైద్య ఖర్చుల భారం తగ్గించేందుకు సీఎంఆర్ఎఫ్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు. ఆర్థిక సాయం అందడంపై లబ్ధిదారులు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వార్తలు