5 September, 2026 | 12:56 AM

జిల్లాలో సహకార వారోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలి

14-11-2024 | 01:50pm

 నవంబర్ 14 నుంచి 20 వరకు 71 వారోత్సవాల

సహకార వారోత్సవాల పోస్టర్  ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

పెద్దపల్లి, (విజయ క్రాంతి): జిల్లాలో 71వ అఖిలభారత సహకార వారోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష  సంబంధిత అధికారులకు సూచించారు. గురువారం  జిల్లా కలెక్టర్ సమీకృత  కలెక్టరేట్ లో సహకార వారోత్సవాల పోస్టర్ ను ఆవిష్కరించారు.  ఈ సందర్భంగా  కలెక్టర్  మాట్లాడుతూ భారతదేశంలో సహకార ఉద్యమం ఒక శతాబ్దానికి పైగా విస్తరించి ప్రపంచంలోనే అతి పెద్ద, అత్యంత ప్రభావంతమైన సామాజిక ఆర్థిక ప్రయత్నాలలో ఒకటిగా ఉద్భవించిందని, వికసిత్ భారత్ యొక్క దృక్పథాన్ని సహకారం చేయడంలో సహకార సంఘాలు కీలకపాత్ర పోషిస్తున్నాయని , దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జన్మదినం సందర్భంగా నవంబర్ 14 నుంచి నవంబర్ 20 వరకు ప్రతి సంవత్సరం సహకార వారోత్సవాలు నిర్వహిస్తామన్నారు.

ప్రస్తుత సంవత్సరంలో వికసిత్ భారత్ నిర్మించడంలో   సహకార రంగం పాత్ర అంశం పై  వారోత్సహాలు నిర్వహించాలని, నవంబర్ 14న సహకార ఉద్యమాన్ని బలోపేతం చేయడంలో సహకార మంత్రిత్వ శాఖ చొరవ పాత్ర, నవంబర్ 15న సహకార సంస్థల్లో ఆవిష్కరణ సాంకేతికత సు పరిపాలన, నవంబర్ 16న వ్యవస్థాపకత ఉద్యోగ కల్పన, నైపుణ్యాభివృద్ధి పోషించడంలో సహకార సంఘాల పాత్ర, నవంబర్ 17న సహకార సంస్థల రూపాంతం, నవంబర్ 18న సహకార సంస్థల మధ్య సహకారాన్ని బలోపేతం చేయడం, నవంబర్ 19నమహిళలు యువతు బలహీన వర్గాలకు కొరకు సహకార సంఘాలు, నవంబర్ 20న స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు మెరుగైన ప్రపంచం కోసం ముందుకు సాగడంలో సహకార సంస్థల పాత్ర వంటి కార్యక్రమాలను అమలు చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వేణు, జిల్లా సహకార అధికారి శ్రీ మాల,  సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Latest News

article_84007398.webp
శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు.. శోభాయాత్ర
05-09-2026 | 12:26am
article_78370952.webp
సురేఖ బర్తరఫ్ ను నిరసిస్తూ కండ్లకు గంతలతో నిరసన
05-09-2026 | 12:21am
article_89788748.webp
మహిళల హామీల అమలుకు బీఆర్‌ఎస్‌ పోరుబాట
05-09-2026 | 12:15am
article_87692102.webp
ఒక వైపు సంబరాలు- మరో వైపు నిరసనలు
05-09-2026 | 12:09am
article_50548316.webp
వికలాంగుల హక్కుల పోరాట సమితి సమావేశం వాయిదా
05-09-2026 | 12:05am
article_71907328.webp
'కాంగ్రెస్'లో చేరిన బీజేపీ నేత కొత్తపల్లి ఉపేందర్ రెడ్డి
05-09-2026 | 12:02am
article_22165615.webp
అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి రూ.లక్ష ఆర్థిక సాయం
04-09-2026 | 11:53pm
article_58560565.webp
అమ్మ ఆశయం కోసం.. ఎంబీబీఎస్ సీటు సాధించిన చందన
04-09-2026 | 11:47pm
article_78773243.webp
చక్రేశ్వర శివాలయంలో వినాయక చవితి ఉత్సవాలకు ఆహ్వానం
04-09-2026 | 11:44pm
article_39840066.webp
వెయ్యి రోజుల పాలనపై మేడ్చల్లో బిఆర్ఎస్ పార్టీ నిరసన ప్రదర్శన
04-09-2026 | 11:41pm
article_45373918.webp
420 హామీలతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్‌
04-09-2026 | 11:35pm
article_85488818.webp
కల్లూరులో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు
04-09-2026 | 11:30pm