వినాయక చవితిని ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి
- మణుగూరు డీఎస్పి రవీంధర్ రెడ్డి
మణుగూరు,(విజయక్రాంతి): వినాయకచవితి ఉత్సవాల(Vinayaka Chavithi celebrations)ను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని మణుగూరు డిఎస్పి వంగ రవీంధర్ రెడ్డి(Manuguru DSP Vanga Ravinder Reddy) సూచించారు. మంగళవారం స్థానిక సబ్ డివిజన్ కార్యాలయంలో ఆయన ఉత్సవ కమిటిల నిర్వాహకులతో, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో శాంతి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్పి మాట్లాడుతూ... మండల, పట్టణ పరిధి ఏరియాల్లో వినాయక ఉత్సవాలు, నిమజ్జనాల నిర్వహణకు ఉత్సవ కమిటి వారు నియమ నిబంధనలను పాటించాలన్నారు. వినాయక నిమజ్జన సమయాల్లో డిజెలకు అనుమతి లేదన్నారు.
మధ్యం సేవించి ఎవరైనా మండపాల వద్ద ప్రజాశాంతికి భంగం కలిగిగే విధంగా ప్రవర్తిస్తే వారిపైఠిన చర్యలు తీసుకుంటామన్నారు. వినాయకుడిని ప్రతిష్టించే మండపం వద్ద తప్పని సరిగా నిర్వాహణ బాధ్యులు ఉండాలని సూచించారు. బాద్యుల వివరాలను మణుగూరు పోలీస్ స్టేషన్లో సమాచారం అందించాలన్నారు. అలాగే ఏ రోజు నిమజ్జనం చేస్తారు, ఏ వాహనం వినియోగిస్తారనే విషయాలను కూడా ముందుస్తుగానే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. ప్రతీ ఒక్క ఉత్సవ కమిటి వారు మైక్, విద్యుత్ అనుమతులను ఆయా శాఖల ద్వారా తప్పనిసరిగా తీసుకోవాలన్నారు.
మండపాల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. గణపతి మండపాలు, అన్నధాన కార్యక్రమాల ఏర్పాట్లను కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసుకోవాలని సూచించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రజలందరూ సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో మణుగూరు సీఐ పాటి నాగబాబు, ఏడూళ్ళబయ్యారం సిఐ వెంకటేశ్వరరావు, , ఎస్ఐ రాజేష్, పోలీస్ సిబ్బంది, వినాయక ఉత్సవ కమిటి సభ్యులు, రాజకీయపార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.