నిమజ్జనం వేడుకల్లో.. ఆరోగ్యమే మహాభాగ్యం
22-09-2026 | 02:19pm
మెట్‌పల్లి, సెప్టెంబర్ 22(విజయక్రాంతి): వినాయక నిమజ్జనం సందర్భంగా మెట్‌పల్లి మండల(Metpally Mandal) ప్రజలు భక్తి శ్రద్ధలతో పాటు ఆరోగ్య, భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని మండల వైద్యాధికారి డాక్టర్ ఎల్లాల అంజిత్ రెడ్డి(Yellala Anjith Reddy) సూచించారు. నిమజ్జనం కార్యక్రమాలకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్నందున, ప్రజారోగ్య పరి రక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు.
నిమజ్జనం ప్రాంతాల్లో పరిశుభ్రతను కాపాడుతూ, అధికారులు సూచించిన భద్రతా మార్గదర్శకాలను పాటించాలని సూచించారు.అధిక శబ్దంతో డిజెలు, సౌండ్ సిస్టమ్స్ వినియోగించకుండా శబ్ద కాలుష్యాన్ని నివారించాలి అని ఆయన కోరారు.