అనుమానాస్పద స్థితిలో వృద్ధురాలి మృతి

22-09-2026 | 12:42pm

ఆసిఫాబాద్(విజయక్రాంతి): ఆసిఫాబాద్ మండలం(Asifabad Mandal) బురుగూడ గ్రామంలో మేకర్తి మల్లక్క (80) అనే వృద్ధురాలు(Elderly woman) అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. మల్లక్క ఒంటరిగా నివసిస్తుండగా, వారం రోజులుగా ఇంటి నుంచి బయటకు రాకపోవడంతో స్థానికులు ఆమె బంధువులకు సమాచారం అందించారు. బంధువులు ఇంటికి వెళ్లి చూడగా మల్లక్క మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో కనిపించింది. మృతదేహంపై కట్టెలు ఉండటంతో ఆమె మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. ఫింగర్‌ప్రింట్‌ బృందం ఆధారాలను సేకరించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వార్తలు