వీవో సంఘాల ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి

17-09-2026 | 05:50pm

గణపురం, సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): జిల్లాలోని మహిళా సంఘాలు(Women's groups) వీవో సంఘాలకు ప్రతి రెండేళ్లకోసారి ఎన్నికలు నిర్వహించాలని ధర్మ సమాజ్ పార్టీ(Dharma Samaj Party) జిల్లా ప్రధాన కార్యదర్శి కండే రవి డిమాండ్ చేశారు.

గురువారం గణపురం మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొన్నిచోట్ల 8, 10 ఏళ్లుగా ఒకరిద్దరే అధ్యక్షులుగా కొనసాగుతున్నారని ఆరోపించారు. మహిళా సంఘాల వ్యవహారాలపై సమగ్ర విచారణ జరిపి పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్, డీపీఎం, సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. సమస్యను పరిష్కరించకపోతే జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా, రాస్తారోకోలు నిర్వహిస్తామని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు