వర్షాల నేపథ్యంలో విద్యుత్ శాఖ అప్రమత్తం

25-09-2026 | 02:37pm

ముకరంపుర, సెప్టెంబర్ 25(విజయ క్రాంతి): బంగాళాఖాతంలో(Bay of Bengal) తీవ్ర వాయుగుండం కారణంగా రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు మోస్తరు నుండి భారీ, కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్(Northern Power Distribution Company of Telangana Limited)  కరీంనగర్ సర్కిల్ లో వర్షాలను ఎదుర్కొనేందుకు పూర్తి సమాయత్తంగా ఉందని సూపరింటెండింగ్ ఇంజనీర్  ఎ.విజేందర్ రెడ్డి  తెలిపారు.

ఈ సందర్భంగా ఎస్ఈ మాట్లాడుతూ విద్యుత్ సిబ్బంది అందరూ క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు విద్యుత్ సరఫరా స్థితిని పరిశీలించాలని ఆదేశించారు.వర్షాల వల్ల ఎక్కడైనా విద్యుత్ అంతరాయం ఏర్పడితే వెంటనే పరిష్కరించేందుకు వీలుగా విద్యుత్ స్తంభాలు, ఇతర సామగ్రిని సిద్ధంగా ఉంచామని వివరించారు. వినియోగదారులకు విద్యుత్ సంబంధిత సమస్యలు ఎదురైతే తక్షణమే ఫిర్యాదు  చేసేందుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని తెలిపారు. కంట్రోల్ రూమ్ నెంబర్ 8712 488 004 అన్న సంప్రదించాలని కోరారు. విద్యుత్ వినియోగదారులు తగిన జాగ్రత్తలు తీసుకొని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 

మరిన్ని వార్తలు