బ్రేకింగ్ న్యూస్‌తో అంతా తలకిందులు!

13-09-2026 | 05:30am

వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్న యువ కథానాయిక అనన్య నాగళ్ల. ఈ బ్యూటీ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజాచిత్రం ‘ది బ్రేకింగ్ న్యూస్’(The Breaking News). పవన్ కడియాలా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఓపెన్ స్కై క్రియేషన్స్ బ్యానర్‌పై రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో టాలీవుడ్ సీనియర్ నటుడు మురళీమోహన్ కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.

ఇదిలావుండగా, హీరోయిన్ అనన్య నాగళ్ల తాజాగా ఈ మూవీకి సంబంధించి ఒక అప్డేట్‌ను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. “ఇదిగో.. సంచలనం సృష్టించబోయే వార్త వచ్చేస్తోంది. ఎదురుచూపులకు తెరపడింది, నిశ్శబ్దం వీడింది. సోషల్ మీడియాను ఊపేయబోయే ఆ బ్రేకింగ్ న్యూస్ వచ్చేస్తోంది” అని పేర్కొంది అనన్య. ఈ మూవీ ట్రైలర్‌ను సెప్టెంబర్ 18న విడుదల చేయబోతున్నట్లు కూడా వెల్లడించిందీ ముద్దుగుమ్మ.

క బలమైన కథ, దానికి తగ్గట్టుగా అదిరిపోయే విజువల్స్‌తో ఈ ట్రైలర్ ఉండబోతోందని పేర్కొంది. ప్రేక్షకులను ఆలోచింపజేసే, అంతా తలకిందులు చేసే మరో సంచలనాత్మక వార్త కూడా ఆ రోజు బయటకు రానుందని తెలుపడటం ద్వారా సినిమాపై అంచనాలు పెంచేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. 

మరిన్ని వార్తలు