పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇవ్వరా..?

04-10-2026 | 04:03pm

వికారాబాద్, అక్టోబర్: పేదలకు డబల్ బెడ్రూమ్స్ ఇళ్లు ఇవ్వకుండా.. తాగుబోతులకు గంజాయి బ్యాచ్లకు అడ్డాలుగా మారుస్తున్నారని వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్(Former MLA Dr. Methuku Anand) అన్నారు. ఆదివారం నాడు ఆయన పార్టీ కార్యకర్తలతో కలిసి దారుల్లో పలు సమస్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా ధారూర్ పట్టణంలో BRS ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను పరిశీలించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మా BRS ప్రభుత్వ హయాంలోనే 90% డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తి చేశాం. కానీ నేడు లబ్ధిదారులకు 10% పూర్తి చేసి అందించాల్సిన ఇళ్లు నిర్లక్ష్యంతో తాగుబోతులకు, గంజాయి బ్యాచ్లకు అడ్డాలుగా మారడం బాధాకరమన్నారు.

ధారూర్‌లో పేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఇవ్వడానికి కాంగ్రెస్ నాయకులకు పేదవాళ్లు కనిపించడం లేదా? మా నాయకుడు కేసీఆర్ కి పేరు వస్తుందనే కారణంతోనే ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారనే అనుమానం ప్రజల్లో ఉందన్నారు. వెంటనే అర్హులైన పేదలకు ఇళ్లను కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తలు