చైనా క్యాంపస్ పేరుతో తప్పుడు ప్రచారం

01-10-2026 | 05:30am

ఖండించిన నారాయణ విద్యా సంస్థల యాజమాన్యం

హైదరాబాద్, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి): నారాయణ, శ్రీ చైతన్య సంస్థ(Sri Chaitanya Institutions)ల మధ్య ‘చైనా క్యాంపస్’ పేరిట భాగస్వామ్యం కుదిరినట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారమవుతున్న నకిలీ, అనధికార పోస్టర్‌ను నారాయణ విద్యాసంస్థ(Narayana Educational Institutions) తీవ్రంగా ఖండిస్తోంది.

సామాజిక మాధ్యమాల్లోని పోస్టర్‌లో ఉన్న సమాచారం పూర్తిగా అసత్యం, నిరాధారం, కల్పింతం అని మేము స్పష్టం చేస్తున్నామని నారాయణ విద్యా సంస్థల ప్రెసిడెంట్ పునీత్ కొత్తప ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నారాయణ సంస్థ అటువంటి ఒప్పందం ఏదీ కుదుర్చుకోలేదు; ప్రస్తుతానికి గానీ, భవిష్యత్తులో గానీ అలాంటి ప్రతి పాదనేదీ మా పరిశీలనలో లేదు.. మా సంస్థ పేరు, అధికారిక చిహ్నం(లోగో), బ్రాండ్ గుర్తింపును దుర్వినియోగం చేయడం తీవ్రమైన నేరమని, విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉద్యోగులు, అధ్యాపకులు, ప్రజలెవరూ ఈ మోసపూరిత సమాచారాన్ని నమ్మవద్దని, ఇతరులకు పంపవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.

నారాయణ సంస్థకు సంబంధించిన ఏ అధికారిక ప్రకటనైనా కేవలం మా అధికారిక మాధ్యమాల ద్వారా మాత్రమే తెలియజేస్తామన్నారు. ఈ నకిలీ ప్రచార చిత్రాన్ని రూపొందించి ప్రచారం చేస్తున్న వారిపై నారాయణ సంస్థ చట్టపరమైన చర్యలు ప్రారంభించిందన్నారు. సం బంధిత అధికారులకు ఫిర్యాదు కూడ నమోదు చేస్తు న్నామన్నారు. మీడియా, ప్రజలు అప్రమత్తంగా ఉండి ఈ తప్పుడు ప్రచారం వ్యాప్తి చెందకుండా సహకరించాల్సిందిగా ఆయన కోరారు.

మరిన్ని వార్తలు