దేవాలయానికి భూ విరాళం

02-10-2026 | 08:38pm

దాతలకు అభినందనల వెల్లువ

కోదాడ అక్టోబర్ 2,(విజయ క్రాంతి): మండలంలోని గుడిబండ గ్రామంలో(Gudibanda village) యరగాని గాంధీ జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు భార్య సులోచన కుమారులు రామయ్య, రమేష్ లు శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయంకు ఒక ఎకరం, శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవాలయముకు ఒక ఎకరం భూమి శుక్రవారం విరాళంగా అందించారు. కోటి రూపాయల విలువైన భూమిని దేవాలయానికి విరాళం ఇచ్చిన దాతలను పలువురు అభినందించారు.

ఈ కార్యక్రమంలో పీసీసీ డెలిగేట్ లక్ష్మీనారాయణ రెడ్డి ,జిల్లా గ్రంధాలయ అధ్యక్షులు వంగవీటి రామారావు, ఎక్స్ డి సి సి చైర్మన్ పాండురంగారావు, నల్లగొండ ఎస్ సి శ్రీనివాసరావు, కోదాడ పీఏసీఎస్ చైర్మన్ ఓరుగంటి శ్రీనివాస్ రెడ్డిగార్లతో పాటుగా శ్రీ సీతారామాంజనేయ స్వామి వారి కమిటీ  అధ్యక్షులు యరగని లక్ష్మయ్య, సర్పంచ్ మందులు నాగయ్య, తుమాటి నాగిరెడ్డి , ఇర్ల నరసింహారెడ్డి, చింత మాధవరెడ్డి ,ఆత్కూరి రాంబాబు,  ఓరుగంటి రాధాకృష్ణారెడ్డి,కుక్కడపు సైదులు, చింతా వెంకట్ రెడ్డి, బెజవాడ నర్సిరెడ్డి, కుక్కడపూ నాగరాజు, పులి రాజా, పులిగామయ్య, ఎండి హసనాలి, సిద్దయ్య గ్రామస్తులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు