విద్యుత్ షాక్‌తో రైతు మృతి
బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామస్తుల ధర్నా
నేరేడుచర్ల, సెప్టెంబర్ 19(విజయ క్రాంతి): కరెంట్ షాక్(Electric shock)కు గురైన రైతును,మిర్యాలగూడ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందిన సంఘటన నేరేడుచర్ల మండలంలోని చిల్లేపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.పూర్తి వివరాల్లోకి వెళ్తే నేరేడుచర్ల మండలం చిల్లేపల్లి గ్రామానికి చెందిన బోరిగొర్ల సైదులు(48,తండ్రి వెంకయ్య,తన వ్యవసాయ పొలానికి కరెంట్ రావడం లేదని ట్రాన్స్‌ఫార్మర్ వద్దకు వెళ్లగా సైదులకు విద్యుత్ షాక్కు గురైనాడు.
దీంతో కుటుంబ సభ్యులు,స్థానికులు హుటాహుటిన మిర్యాలగూడ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు.మృతుడికి ఇద్దరు కూతుళ్లు,ఒక కుమారుడు వున్నారు.కుటుంబం పెద్ద దిక్కును కోల్పోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.సైదులు మృతికి కారణమైన పరిస్థితులపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని,రోడ్డుపై ధర్నా చేపట్టారు.