రైతు నమోదు తప్పనిసరి

23-09-2026 | 11:09pm

చివ్వెంల, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): ప్రభుత్వ వ్యవసాయ పథకాలు, సేవలు పొందేందుకు రైతులు అగ్రిస్టాక్‌ రైతు నమోదు (రైతు గుర్తింపు సంఖ్య) తప్పనిసరిగా చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి డి. వెంకటేశ్వర్లు(Mandal Agriculture Officer D. Venkateswarlu) తెలిపారు. బుధవారం జయరాంగుడి తండా, ఐలాపురం గ్రామాల్లో రైతు నమోదుపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.

సెప్టెంబర్ 22 నుంచి 30 వరకు ప్రత్యేక రైతు నమోదు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రైతు గుర్తింపు సంఖ్య ద్వారా పంటల కొనుగోళ్లు, ఎరువుల కొనుగోలు, వివిధ ప్రభుత్వ పథకాలు, వ్యవసాయ సేవలు పొందవచ్చన్నారు. రైతులు వ్యవసాయ విస్తరణ అధికారి, మీ-సేవ లేదా కామన్‌ సర్వీస్‌ సెంటర్లలో ఆధార్, భూమి పాస్‌బుక్, ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్‌ నంబర్‌తో నమోదు చేసుకోవాలని సూచించారు.

మరిన్ని వార్తలు