రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందించాలి

19-09-2026 | 07:35pm

లో-వోల్టేజ్, విద్యుత్ అంతరాయాలను వెంటనే పరిష్కరించాలి: బీజేపీ కిసాన్ మోర్చా

ఆలేరు, సెప్టెంబర్ 19 (విజయక్రాంతి): రైతుల(Farmers ) సాగు విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ కిసాన్ మోర్చా(BJP Kisan Morcha) ఆధ్వర్యంలో భువనగిరి డీఈ కార్యాలయం(Bhuvanagiri DE office) ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు ఫకీర్ రాజేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఊట్కూరి అశోక్ గౌడ్, కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడమటి జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. పంటలకు నీరు అవసరమైన సమయంలో విద్యుత్ అంతరాయాలు, లో-వోల్టేజ్‌తో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

బోర్లు, మోటార్లకు సరిపడా విద్యుత్ అందక పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడుతోందన్నారు. విద్యుత్ హెచ్చుతగ్గులతో వ్యవసాయ మోటార్లు దెబ్బతిని రైతులపై అదనపు భారం పడుతోందని పేర్కొన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించాలని డిమాండ్ చేశారు. ధర్నాలో దాసరి మల్లేశం, మురళీధర్ రెడ్డి, మాయ దశరథ, కాదూరి అచ్చయ్య, పట్నం శ్రీనివాస్, జైనపల్లి శ్యాంసుందర్ రెడ్డి, సుర్వి శ్రీనివాస్ గౌడ్, సురకంటి రంగారెడ్డి, దయ్యాల కుమారస్వామి, మాధురి, రామచందర్, రాజు, పడమటి మాణిక్యం రెడ్డి, బోల నరసింహ యాదవ్, తునికి దశరథ, రత్నపురం బలరాం, చీర్కా సురేష్ రెడ్డి, బోళ్ల సుదర్శన్, మేడి కోటేష్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు