జూరాల నీళ్ల కోసం రైతుల పోరాటం

22-09-2026 | 05:30am
  1. కళ్లముందే ఎండుతున్న పంటలు.. 
  2. నీళ్లున్నా విడుదల చేయరా?
  3. తాగునీటికి అవసరమైనవి ఉంచి.. మిగిలిన నీటిని సాగుకు ఇవ్వాలి
  4. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేల అరెస్టులతో జూరాల వద్ద హైటెన్షన్

వనపర్తి, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): జూరాల నీటి విడుదల వ్యవహారం ఉమ్మడి పాలమూరు జిల్లా(Palamuru District)లో ఉద్రిక్తతకు దారితీసింది. జూరాల ఆయకట్టు కింద పంటలు ఎండిపోతుండటంతో సాగునీటి(Irrigation water)ని విడుదల చేయాలని రైతులు రోజులుగా ఆందోళ నలు చేస్తున్నారు. పంట చేతికొచ్చే దశలో నీరు అందకపోతే పెట్టుబడులు, శ్రమ మొత్తం వృథా అవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు(Jurala Project), గద్వాల కలెక్టరేట్(Gadwal Collectorate) వద్ద రైతుల నిరసనలు కొనసాగుతుండగా.. ఆదివారం కొం దరు రైతులు కాలువ గేట్లు తెరిచి నీటిని విడుదల చేసుకు నే ప్రయత్నం చేయడంతో అధికారులు గేట్లు మూసివేశారు.

రైతులపై కేసులు నమోదు చేయడంతో పాటు జూరాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశా రు. సాగునీటి కోసం రైతుల ఆందోళనకు మద్దతుగా వస్తు న్న మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్టు చేయడం తో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. దీంతో జూరా ల పరిసరాల్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. నీళ్లు విడుదల చేసే వరకు ఆందోళన కొనసాగిస్తామని రైతులు స్పష్టం చేస్తున్నారు. 

పంట చేతికొచ్చే వేళ.. నీటికోసం పోరాటం

జూరాల ఆయకట్టు పరిధిలో వరి, ఇతర పంటలు కీలక దశలో ఉన్నాయని రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం నీరు అందకపోతే పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం పడటంతో పాటు పెట్టుబడులు కూడా నష్టపోయే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్త పంటలకు నీళ్లు అడగడం లేదు.. ఇప్పటికే సాగులో ఉన్న పంటలను కాపాడేందు కు నీళ్లు ఇవ్వండి అనేది రైతుల ప్రధాన డిమాండ్గా మారింది. 

8.8 టీఎంసీల నీరు ఉన్నా ఎందుకివ్వరు? 

జూరాల ప్రాజెక్టులో ప్రస్తుతం 8.8 టీఎంసీల నీరు ఉందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. తాగునీటి అవసరాలకు అవసరమైన నీటిని రిజర్వులో ఉంచి, మిగిలిన నీటిని సాగుకు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తాగునీటి అవసరాలకు సుమారు 1.08 టీఎంసీలు అవసరమని, మిగిలిన నీటిలో సుమారు 5 టీఎంసీలను సాగుకు వినియోగించే అవకాశం ఉందని పేర్కొన్నారు. జూరాలలో నీళ్లు ఉన్నప్పుడు రైతుల పంటలు ఎందుకు ఎండాలి? తాగునీటికి అవసరమైన నీటిని ఉంచి మిగిలిన నీటిని సాగుకు ఇవ్వాలి. రైతులను ఇబ్బంది పెట్టడం సరికాదు అని నిరంజన్రెడ్డి అన్నారు. 

ప్రభుత్వ వాదన మరోలా..

మరోవైపు జూరాల నుంచి సాగునీరు విడుదల చేస్తే రానున్న వేసవిలో తాగునీటి సమస్య తలెత్తే అవకాశం ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు చెబుతున్నారు. ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ పం టలు వేసుకోవాలని ముందుగానే సూచించామని ప్రభుత్వం వాదిస్తోంది. జూరాల నీటిని సాగుకు విడుదల చేయకపోవడానికి గత ప్రభుత్వమే కారణమని మంత్రి ఆరోపిస్తున్నారు. దీంతో జూరాల నీటి వినియో గంపై ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య వాదోపవాదాలు ముదిరాయి.  

నిర్ణయం కోసం రైతుల ఎదురుచూపు 

జూరాల ఆయకట్టు రైతుల చూపంతా ప్రభుత్వ నిర్ణయంపైనే ఉంది. తాగునీటికి అవసరమైన నీటిని రిజర్వులో ఉంచి, మిగిలిన నీటితో ఇప్పటికే సాగులో ఉన్న పంటలను కాపాడేలా తక్షణ నిర్ణయం తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. పంట ఎం డిపోయిన తర్వాత నీళ్లు ఇచ్చినా ప్రయోజనం ఉండదని.. ఇప్పుడే నిర్ణయం తీసుకో వాల్సిన సమయం వచ్చిందని వారు అంటున్నారు.  ఇప్పటికే ఆందోళన తీవ్రరూపం దా ల్చిన నేపథ్యంలో ప్రభుత్వంరైతుల మధ్య చ ర్చల ద్వారా సమస్యకు పరిష్కారం చూపుతుందా.. లేక ఉద్యమం మరింత ఉధృతమ వుతుందా అన్నది ఉత్కంఠగా మారింది. 

రైతుల ఉసురు మంచిది కాదు: 

రైతుల ఉసురు మంచిది కాదు. అధికారులను కూర్చోబెట్టి మాట్లాడండి. జూరాలలో పంటలకు సరిపడా నీళ్లు ఉన్నాయి. వెంటనే సాగునీటిని విడుదల చేయాలి. లేదంటే వేలాది మంది రైతులతో కలిసి జూరాలకు వెళ్లి ఉద్యమిస్తాం.

 మాజీ మంత్రి, సింగిరెడ్డి నిరంజన్రెడ్డి 

మరిన్ని వార్తలు