చిటకోడూరులో రైతులకు పత్తి ఎరువులు, మందుల పంపిణీ

02-10-2026 | 05:32pm

జనగామ, అక్టోబర్ 2(విజయక్రాంతి):  జనగామ మండలం చిటకోడూరు రైతు వేదికలో సర్పంచ్ కూకట్ల యాదగిరి ఆధ్వర్యంలో 15 మంది రైతులకు పత్తి పంటకు అవసరమైన ఎరువులు, పురుగు మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి గిరిరాజు అనిల్ కుమార్(Agriculture Officer Giriraju Anil Kumar) మాట్లాడుతూ సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించడం, దగ్గరగా మొక్కలు నాటడం వల్ల అధిక దిగుబడి వస్తుందని వివరించారు.

సమతుల్య ఎరువులు, సకాలంలో పురుగు మందులు పిచికారీ, నీటి యాజమాన్యంతో నాణ్యమైన పత్తి పండించి ఆదాయం పెంచుకోవచ్చని సూచించారు. పంపిణీ చేసిన మందులను వ్యవసాయ శాఖ సూచించిన మోతాదులో మాత్రమే వాడాలని కోరారు. కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు, గ్రామ కార్యదర్శి, రైతులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు