పాము కాటుకు గురైన వ్యక్తికి ఆర్థిక సహాయం
మున్సిపల్ బిజెపి కౌన్సిలర్ వచ్ పల్లి అర్చన శ్రీనివాస్ ముదిరాజ్
మేడ్చల్ అర్బన్ సెప్టెంబర్ 25(విజయక్రాంతి):ఎల్లంపేట్ మున్సిపల్ పట్టణంలోని (Ellampet Municipal Town) 24వ వార్డుకు చెందిన బక్క రామ్మూర్తి తన పొలంలో వ్యవసాయ పనులు చూస్తుండగా పాము కాటుకు గురైన విషయం తెలుసుకొని ఆసుపత్రికి వెళ్లి ఆయనను పరామర్శించడం జరిగిందని మున్సిపల్ బిజెపి కౌన్సిలర్ వచ్ పల్లి అర్చన శ్రీనివాస్ ముదిరాజ్ పేర్కొన్నారు.అనంతరం ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకోనీ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించడం జరిగిందని ఆమే చెప్పారు.
అదేవిధంగా రామ్మూర్తి చికిత్సకు తన వంతు సహాయంగా 5000/ ఆర్థిక సహాయం అందించడం జరిగిందని వచ్ పల్లి అర్చన శ్రీనివాస్ ముదిరాజ్ వెల్లడించారు.తనకు ఆర్థిక సహాయం అందించిన ఎల్లంపేట్ మున్సిపల్ బిజెపి కౌన్సిలర్ వచ్ పల్లి అర్చన శ్రీనివాస్ ముదిరాజ్ దంపతులకు బాధితుడు రామ్మూర్తి కృతజ్ఞతలు తెలియజేశారు...
1) ఆసుపత్రిలో పాము కాటుకు గురైన రామ్మూర్తి చికిత్సకు 5000/ అందించిన కౌన్సిలర్ అర్చన శ్రీనివాస్ ముదిరాజ్...