ట్రాక్టర్, బైక్ డీ ఒకరికీ తీవ్ర గాయాలు
25-09-2026 | 10:43pm
బెల్లంపల్లి,(విజయ క్రాంతి): మంచిర్యాల జిల్లాలో(Mancherial District) బెల్లంపల్లి కాల్ టెక్స్(Bellampalli Caltex) ఫ్లైఓవర్ పై ట్రాక్టర్, బైక్ ఢీకొన్న(Tractor and bike collide) సంఘటనలో ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మందమర్రి కి చెందిన అంజద్ మోటార్ సైకిల్ పై వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ డీకొట్టింది. ఈ సంఘటనలో అంజద్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే ఆయన్ను బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల కు రెఫర్ చేశారు. ఈమేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.