22 August, 2026 | 6:59 PM

బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం

22-08-2026 05:54 PM

నంగునూరు,(విజయక్రాంతి): నంగునూరు మండల పరిధిలోని గట్లమల్యాల గ్రామానికి చెందిన ఏర్పుల యాదయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఏఎంసీ చైర్మన్ దేవులపల్లి యాదగిరి సహకారంతో డైరెక్టర్ గాండ్ల రమేష్ ద్వారా  కుటుంబ సభ్యులను పరామర్శించి, మానవతా దృక్పథంతో 50 కిలోల బియ్యం అందజేసి ఆర్థికంగా అండగా నిలిచారు. ఈ కార్యక్రమంలో ఎర్ర రమేష్, పుల్లూరి రవి, మంగళారపు వెంకటేష్, ఏర్పుల రాకేష్, పుల్లూరు సాయి, ప్రభాకర్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.