ఆర్థిక సాధికారతే ప్రధాన ధ్యేయం
- రైతులు, మహిళల సంక్షేమమే లక్ష్యం
- కేంద్ర మంత్రులు శివరాజ్‌సింగ్ చౌహాన్, కిషన్‌రెడ్డి
- రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్‌లో మహిళా సంఘాలు, రైతులతో ముఖాముఖి
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు
రంగారెడ్డి, సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధి, రైతుల ఆదాయ పెంపుతో పాటు మహిళల ఆర్థిక సాధికారతే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం (Central Government)వేగంగా అడుగులు వేస్తోందని కేంద్ర వ్యవసా య శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి (Union Minister for Coal Mines Kishan Reddy) పునరుద్ఘాటించారు.
ప్రధాని మోదీ జన్మదిన వేడుకలతో పాటు విశ్వకర్మ జయంతి, తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపూర్‌లో గురువారం రైతులు, మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులతో ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. గతంలో రజాకార్ల దాడుల నుంచి గ్రామాన్ని ర క్షించుకోవడానికి పూర్వీకులు నిర్మించిన తిమ్మాపూర్ బు రుజును కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సందర్శించి, ధైర్యసాహసాలు చాటిన వీరులకు నివాళులర్పించారు.
స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేస్తున్నామని తెలిపారు. జిల్లాలో ఇంకా ఈ స్థాయికి చేరని మహిళలను గుర్తించి, వారికి బ్యాంకు రుణాలు, తగిన శిక్షణ అందించి లఖ్‌పతి దీదీలుగా తీర్చిదిద్దేలా పక్కా ప్రణాళికలు రూపొందించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా అర్హులైన ప్రతి పేద కుటుంబానికి పక్కా ఇల్లు అందిస్తామన్నారు. తెలంగాణలో వ్యవసాయాభివృద్ధికి సమగ్ర రోడ్‌మ్యాప్ రూపొందించడంతో పాటు, పంట నష్టాల సమయంలో రైతులను ఆదుకునేందుకు పంట బీమా పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తామన్నారు. తిమ్మాపూర్ పరిసర ప్రాంతాల్లో రూ. 17 కోట్ల తో రహదారి పనులు, శ్రీశైలం రోడ్డు నుంచి లేమూరు, అగ్రిమల, అవనిగడ్డ, తిమ్మాపూర్ మీదుగా సుమారు రూ. 38 కోట్లతో (మొత్తం రూ. 55 కోట్లు) ఆధునిక ర హదారుల నిర్మాణం చేపడుతున్నట్లు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు.
కిసాన్ క్రెడిట్ కార్డులు, ఎరువుల స బ్సిడీ, ఉచిత ధాన్యాల పంపిణీ వంటి పథకాల ద్వారా కేంద్రం ప్రజలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకం నేరుగా పేదలు, రైతులు, మహిళలకు చేరేలా పారదర్శక చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర సహాయ మంత్రి రామ్‌నాథ్ ఠాకూర్ తెలిపారు.
గతంతో పోలిస్తే ప్రస్తుతం గ్రామాల్లో దాదాపు ప్రతి ఇంటికీ బ్యాంకు ఖాతా, మరుగుదొడ్డి, రవాణా వసతులు అందుబాటులోకి వచ్చాయ ని, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వల్ల గ్రామీణ ప్రాంత ప్రజల జీవన ప్రమాణాలు గణనీయంగా పెరిగాయని ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. రంగారె డ్డి జిల్లా ప్రగతి వివరాలను అదనపు కలెక్టర్ డా. కే. కిరణ్మయి వెల్లడించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు, జడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి, డీపీవో సురేష్ మోహన్, పీడీ డీఆర్డిఏ శ్రీలత, సర్పంచ్ అంజమ్మ పాల్గొన్నారు.