జోగిపేటలో అగ్నిప్రమాదం.. కాలిపోయిన అప్లికేషన్ పత్రాలు

20-09-2026 | 08:56am

జోగిపేట: సంగారెడ్డి జిల్లా జోగిపేట వ్యవసాయశాఖ కార్యాలయ ఆవరణలో అగ్నిప్రమాదం(Fire Accident) జరిగింది. ఈ ప్రమాదంలో గోదాములో నిల్వ ఉంచిన రైతుల వ్యవసాయ సబ్సిడీ పరికరాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. అగ్నిప్రమాదంలో కాలిపోయిన రైతుల అప్లికేషన్ పత్రాలు(Farmers application documents), ఆఫీస్ ఓల్డ్ ఫర్నిచర్ కాలిపోయాయి. గోదాంకు తాళం వేసి ఉండటంతో జేసీబీ సహాయంతో రేకులు తొలగించి మంటలను అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టిన జోగిపేట పోలీసులు.

మరిన్ని వార్తలు