వన్య ప్రాణిని పరిరక్షించుకుందాం.. వేటాడితే జైలుకే

02-10-2026 | 07:25pm

బోథ్ అక్టోబర్ 2 (విజయక్రాంతి): అడవులతో పాటు అడవుల్లో పెరిగే వన్యప్రాణులను మనం పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని సర్పంచ్ కురుమే అన్నపూర్ణ పేర్కొన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో అటవీశాఖ(Forest Department) ఆధ్వర్యంలో వన్యప్రాణి సంరక్షణ వారోత్సవాలలో భాగంగా ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ జీవ వైవిధ్యం అంటే ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటుందని చెట్లు ఉంటే అడవిలో జంతువులు పెరుగుతాయని అడవి జంతువులను కాపాడుకుంటే అటవీలో సమతుల్యత ఉంటుందన్నారు. కార్యక్రమంలో బోత్ రేంజ్ అధికారి కవిత డిప్యూటీ రేంజ్ అధికారి నాగోరావు, ఎంపీడీవో రమేష్ తో పాటు ఉప సర్పంచ్ విజయ లక్ష్మి వార్డు సభ్యులు కట్ట భూమేష్ అటవీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు