వన్యప్రాణులను సంరక్షించాలి
చెన్నూర్ , (విజయక్రాంతి): వన్యప్రాణులను సంరక్షించి(wildlife conservation) జీవ వైవిధ్యాన్ని కాపాడి పర్యావరణ సమతుల్యత కోసం ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యత వహించాలని చెన్నూర్ ఫారెస్ట్ డిప్యూటీ సిఎఫ్& డివిజనల్ అధికారి ఏ రామమూర్తి (Dy. CF & Forest Divisional Officer Chennur) అన్నారు.
జాతీయ వన్యప్రాణీ వారోత్సవాలలో బాగంగా శుక్రవారం చెన్నూర్ పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వన్యప్రాణులు మన ప్రకృతి సంపదలో అమూల్యమైనవి అడవులు, వన్యప్రాణులని అన్నారు .కావ్వాల్ టైగర్ రిజర్వ్, ప్రాణహిత కృష్ణజింకల అభయారణ్యం, శివ్వారం మొసళ్ల అభయారణ్యం వంటి రక్షిత ప్రాంతాలు అనేక అరుదైన వన్యప్రాణులకు ఆవాసాలుగా ఉన్నాయన్నారు.
వన్యప్రాణులను వేటాడటం, పట్టుకోవడం, వాటికి హాని కలిగించడం, విద్యుత్ తీగలు అమర్చి వేటాడటం తీవ్రమైన నేరమన్నారు.ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అటవీ ప్రాంతాల్లో ప్లాస్టిక్, చెత్త వేయకుండా, అగ్ని ప్రమాదాలకు కారణమయ్యే చర్యలకు దూరంగా ఉండి, వన్యప్రాణుల ఆవాసాలను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు.
వన్యప్రాణుల అవాసాల అనుసంధానం -వన్యప్రాణుల అభివృద్ధి. ‘అడవిని కాపాడుదాం – వన్యప్రాణులను రక్షిద్దాం – జీవవైవిధ్యాన్ని పరిరక్షిద్దాం’ అనే నినాదంతో ప్రజలందరు వన్యప్రాణుల సంరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు, చెన్నూరు,కోటపల్లి,నీల్వాయి రేంజ్ అధికారులు, బి చంద్రమౌళి,ఎం సదానందం, హాఫీసోద్దీన్ , డిప్యూటీ రేంజ్ అధికారులు పోలోజి ప్రభాకర్, లక్ష్మీనారాయణ, ఎఫ్ఎస్ఓలు, ఎఫ్ బిఓలు, వాచర్లు పాల్గొన్నారు.