అంత్యక్రియల కోసం ఆర్థిక సహాయం అందజేత
సేవే పరమావధి.. ఆ పన్నులకు అభయహస్తంలా మాజీ డిప్యూటీ మేయర్ సేవలు
జవహర్ నగర్,(విజయక్రాంతి): సేవే పరమావధిగా ఆ పన్నులకు అభాగ్యులకు, అభయ హస్తంలా నిలుస్తూ, జవహర్ నగర్ లో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు మాజీ డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్ గుప్తా(Former Deputy Mayor Reddy Shetty Srinivas Gupta). మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ కార్పొరేషన్(Malkajgiri Municipal Corporation) పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ కెఎన్ఆర్ కాలనీలో, కాలనీ వాసుడు పట్నాల చంద్రశేఖర్ హఠాత్తుగా మరణించగా విషయం తెలుసుకున్న శ్రీనివాస్ గుప్తా బుధవారం చంద్రశేఖర్ కు నివాళులర్పించారు. అనంతరం మృతుని కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు, కందుల శంకర్, పండాల రాజు గౌడ్, సింగం బాలరాజ్ పటేల్, భాశెట్టి వీరేష్, ఉచ్చంతల రాములు, నంగునూరు అశోక్ గుప్తా, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.