‘కోహెడ ఫ్యాక్స్’పై ‘నలుగురి’!?
- మంత్రి పొన్నం అశీస్సులు ఎవరికి.?
- హుస్నాబాద్ నియోజక వర్గంలో చైర్మన్ల నియమకం జాప్యం
కోహెడ, సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): హుస్నాబాద్ నియోజకవర్గం లోని ప్రాథమిక వ్యవసాయ సహాకార సంఘం చైర్మన్ పదవి నియామకం జాప్యం పట్ల కాంగ్రెస్ కార్యకర్తలలో (Congress workers) అసంతృప్తి నెలకొంది. పక్కనే ఉన్న మానకొండూర్ నియోజక వర్గం (Manakondur Constituency) పరిధిలో 12 సోసైటీలు ఉన్నాయి. ఇందులో గాలిపెల్లి సోసైటి చైర్మన్ పదవి నియమకం మినహయించి 11 సోసైటీలలో చైర్మన్లను అక్కడి నియోజకవర్గం ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ (MLA Kavampalli Satyanarayana) నియమించారు.
హుస్నాబాద్ నియోజక వర్గంలో బిన్నంగా ఉంది. 7 సోసైటీలలో ఇప్పటివరకు చైర్మన్ల పదవిని నియమించలేదు. ఇన్ చార్జ్ లుగా గత చైర్మన్లు కొనసాగటం పై కాంగ్రెస్ కార్యకర్తలలో అసంతృప్తి వ్యక్తమైతుంది. ఈ నేపథ్యంలో చైర్మన్ల నియమకం జాప్యం ఐనప్పుటికి ఇటీవల చైర్మన్ల నియామకం కోసం ఆయా మండలాలలో కసరత్తు ముమ్మరమైందని సమాచారం. ఈ నేపథ్యంలో కోహెడ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ పీఠం కోసం నలుగురు పోటీ పడుతున్నట్లు తెలిసింది.
పదవీకాలం ముగిసినప్పటి నుంచి కోత్త సారథి ఎంపిక పై మండల పార్టీలో తీవ్ర స్థాయిలో కసరత్తు కొనసా... గుతుంది. ఇటీవల మండల పార్టీ అధ్వర్యంలో చైర్మన్ పదవికి పోటీ పడుతున్న నలుగురి పేర్లను హుస్నాబాద్ ఎమ్మెల్యే, రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు పంపినట్లు తెలిసింది. దింతో అశవాహులు పదవి తనకే దక్కుతుందని ఎవరి ధీమాలో వారు ఉన్నారు.
ఇద్దరి పేర్ల పై మండలంలో చర్చ..
నలుగురి అశవాహులలో ఇద్దరి పై ప్రధానంగా చర్చ మండల వ్యాప్తంగా జరుగుతుంది. తంగళ్లపల్లి గ్రామం బీసీ సామాజీక వర్గానికి చెందిన సీనీయర్ నాయకులు బండిపల్లి నారయణ, మండల కేంద్రానికి చెందిన రెడ్డి సామాజీక వర్గం నాయకులు దొమ్మట జగన్ రెడ్డి, చెంచల్ చెర్వుపల్లికి చెందిన మరో సీనీయర్ నాయకులు భీంరెడ్డి మల్లారెడ్డి, పొరెడ్డిపల్లికి చెందిన ఎస్సీ సామాజీక వర్గం సీనీయర్ నాయకులు మంద ధర్మయ్య చైర్మన్ పదవికి పోటీ పడుతున్నారు.
ఇందులో చైర్మన్ పదవి ఖరారు పై రెడ్డి సామాజిక వర్గంకు చెందిన జగన్ రెడ్డి, మల్లారెడ్డి పేర్లు ప్రధానంగా మండంలో చర్చ తీవ్రమైంది. కాగా అవకాశాన్నిబట్టి పార్టీలు మరుతున్న జగన్ రెడ్డికి చైర్మన్ పదవి కేటాయిస్తే ఊరుకునేది లేదని.. కష్టాకాలంలో సైతం మూడు, నాలుగు దశాబ్దికాలం పాటుగా పార్టీని వదలకుండా ఉన్న నారాయణగౌడ్, ధర్మయ్య, మల్లారెడ్డి లకు చైర్మన్ పదవి కేటాయించాలని.. మండల వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు బహిర్గతంగానే తమ బాని వినిపిస్తున్నారు.
కాగా కోహెడ సర్పంచ్, కోహెడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులలో ఇరువురు ఎస్సీ సామజిక వర్గం మహిళలు కొనసాగటంతో మంద ధర్మయ్యకు చైర్మన్ పదవి దక్కదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పోన్నం ప్రభాకర్ కు అధిష్టానం నుంచి టికెట్ ఖరారు చేయబడిన తర్వాత పొన్నం సమక్షంలో కాంగ్రెస్ కండువ కప్పుకున్న జగన్ రెడ్డి కి పదవి దక్కడం కష్టమే అని.. వినికిడి. గత టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జగన్ రెడ్డి కోహెడ ఫ్యాక్స్ చైర్మన్ గా పదవి నిర్వహించారు. ఇప్పుడు కోత్త వారికి కాంగ్రెస్ సీనియర్ నాయకులకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ కార్యకర్తలు కోరుకుంటున్నట్లు తెలిసింది.
మంత్రి పొన్నం పైన అశావహుల ధీమా..
కోహెడ పీఎసీఎస్ చైర్మన్ ఫీఠం కోసం అశావహులు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పై ధీమా పెట్టారు. త్వరలోనే మంత్రి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది.