ఘట్ కేసర్ లో ఆయుష్ ఉచిత వైద్య శిబిరం
111 మందికి వైద్య పరీక్షలు, మందుల పంపిణీ
ఘట్ కేసర్, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి) : ఘట్ కేసర్ పట్టణంలోని బ్రూక్ బాండ్ కాలనీ పార్క్ స్థలంలో సోమవారం గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆయుష్ డిపార్ట్మెంట్(Government of Telangana, AYUSH Department) 11వ ఆయుర్వేదిక్ డే -2026 వారి సౌజన్యంతో డాక్టర్ లక్ష్మిదేవి, డాక్టర్ జ్ఞానేశ్వరి పర్యవేక్షణలో దాదాపు 111 మందికి వైద్య పరీక్షలతో పాటు వారికి ఉచితంగా మందులు ఇవ్వడం జరిగింది.
ఈరోజుతో పాటు మూడు రోజులు ఈ ఉచిత హెల్త్ క్యాంపు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈకార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్
ముల్లి పావని జంగయ్య యాదవ్, ఘట్కేసర్ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు బొక్క ప్రభాకర్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ బర్ల రాధాకృష్ణ ముదిరాజ్, నాయకులు కొంతం అంజిరెడ్డి, కడపోళ్ళ మల్లేష్, ఉల్లి ఆంజనేయులుయాదవ్, రహీం, గడిల సంజీవ రెడ్డి,సెక్రటరీలు సిరాజుద్దీన్, మేకల సునీల్, అందెల సాయియాదవ్, రాజేష్, వైద్య సిబ్బంది శ్రీధర్, స్వాతి తదితరులు పాల్గొన్నారు.