ఉచిత గుండె వైద్య శిబిరం

04-10-2026 | 05:06pm

ఖానాపూర్ ( విజయక్రాంతి) : స్వప్న మల్టీస్పెషల్టీ ఆసుపత్రి(Swapna Multispecialty Hospital) ఆధ్వర్యంలో కడెం మండలంలో ఉచిత గుండె వైద్య శిబిరాన్ని(Free Heart Medical Camp) నిర్వహించారు. గుండె వైద్య నిపుణులు డాక్టర్ కిషన్, వైద్యులు నాలం శశికాంత్ సప్న ఆధ్వర్యంలో రోగులకు అన్ని రకాల ఆరోగ్య పరీక్షలు(Health check-ups) నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు.  వైద్యులు గుండె, ఎముకలు, కీళ్లకు సంబంధించిన గాజులపై అవగాహన కల్పించారు . ఈసీజీ, షుగర్ పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేశారు.

కడెం, దస్తురాబాద్ మండలాలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఆసుపత్రి ఆధ్వర్యంలో నిరంతరం ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు డాక్టర్ నాలం శశికాంత్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ విజయ్‌, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు