పోలీస్ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్క్రీనింగ్ టెస్ట్ కు హాజరుకావాలి :ఎస్సై మధు
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి),విజయక్రాంతి అక్టోబర్ 02: తెలంగాణ రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్(Telangana State Police Recruitment Board) ఆధ్వర్యంలో ఇటీవల విడుదలైన ఎస్ఐ,కానిస్టేబుల్ నియామకాల నేపథ్యంలో సూర్యాపేట జిల్లా కలెక్టర్,ఎస్పీ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు అర్వపల్లి ఎస్ఐ మధు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
జాజిరెడ్డిగూడెం మండల అభ్యర్థులు ఆన్లైన్లో ఎన్ రోల్ చేసుకొని,ఈనెల 5న ఉదయం 9గంటలకు తిరుమలగిరి జెడ్పీహెచ్ఎస్ లో జరిగే స్క్రీనింగ్ టెస్ట్ కు హాజరు కావాలన్నారు.ఎంపికైన అభ్యర్థులకు 45 రోజుల ఉచిత శిక్షణ ఉంటుందని,అర్హత కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పోలీసు నియామక పరీక్షలకు సన్నద్ధం కావాలని సూచించారు.