ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా ఆసుపత్రిలో పండ్ల పంపిణీ
17-09-2026 | 05:41pm
ఖానాపూర్ (విజయక్రాంతి): భారత ప్రధాని నరేంద్ర మోడీ(PM Narendra Modi) పుట్టినరోజు సందర్భంగా నిర్మల్ జిల్లా ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ అంకం మౌనిక మహేందర్ పాల్గొని రోగులకు తమ చేతుల మీదుగా పండ్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రధాని మోడీ భారతదేశాన్ని విశ్వ గురువుగా చేశారని, ఆయన నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ఖానాపూర్ మున్సిపల్ కౌన్సిలర్లు బొప్పారపు సత్యవతి, గుమ్ముల అశోక్ ,బండి పల్లి సింధుజ ప్రకాష్, ఆసుపత్రి సూపర్డెంట్ స్వర్ణ రెడ్డి, తదితరులు ఉన్నారు.