హమారా ప్రసాద్ పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి..

17-09-2026 | 07:36pm

తాడ్వాయి, సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): భారత రాజ్యాంగాన్ని రచించిన భారతరత్న డాక్టర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన హమారా ప్రసాద్(Hamara Prasad)పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో గురువారం నాయకులు ఎస్సై నరేష్ కు ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ... దేశ అత్యున్నత చట్టమైన భారత రాజ్యాంగాన్ని రచించి కోట్లాదిమంది పేద ప్రజల హక్కుల కోసం పోరాడిన మహనీయుడు ప్రపంచ మేధావి అయిన అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రసాద్ ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రీయ దళిత సేన నాయకుడిని అని చెప్పుకునే ప్రసాద్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు చిట్యాల సాయన్న మాదిగ, నాయకులు గైని లింగం, గడ్డం రవి, సంతోష్, సర్పంచ్ విజయ రాములు,రంజిత్, పులి ప్రభాకర్,పౌరాజు, స్వామి,శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు