ఆరోగ్య సూత్రాలు వివరించిన మాజీ మంత్రి
17-09-2026 | 07:23pm
నిర్మల్,(విజయక్రాంతి): రాష్ట్ర మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి(Former Minister Indrakaran Reddy) గురువారం నిర్మల్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల(government degree college)లో వాకర్స్ తో కలిసి వాకింగ్ చేశారు. ప్రతిరోజు నడక చేయడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను వాకా సభ్యులకు వివరించారు. వాకా సంఘంలో వందమంది ప్రతిరోజు వ్యాయామాలు యోగా చేయడం వారి ఆరోగ్య అవసరాలకు ఎంతగానో ఉపయోగపడిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు నాలం శ్రీనివాస్ సురేందర్ దేవేందర్ రెడ్డి పాకాల రామ్ చందర్ తదితరులు ఉన్నారు.