అమరుల స్ఫూర్తితో తెలంగాణను కాపాడుకోవాలి
17-09-2026 | 07:29pm
కొత్తపల్లి,(విజయక్రాంతి): చింతకుంటలోని బీఆర్ఎస్(BRS) జిల్లా కార్యాలయంలో గురువారం రోజున జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకలు(National Unity Day celebrations) నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా నారదాసు లక్ష్మణరావు జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం జై తెలంగాణ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... నిజాం పాలన నుంచి తెలంగాణ విముక్తి కోసం ఎందరో అమరులు పోరాడారని గుర్తుచేశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్(Sardar Vallabhbhai Patel) నేతృత్వంలో భారత సైన్యం హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేసిన చారిత్రక ఘట్టాన్ని వివరించారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు.