ఘనంగా గణపురం మండలంలో గణపతి నిమజ్జనోత్సవం
ఏర్పాట్లను పర్యవేక్షించిన సీఐ కరుణాకర్ ఎస్ఐ బొరగల అశోక్
సింగరేణి రెస్క్యూ టీం ఫైర్ సిబ్బంది సేవలు
ప్రశాంతంగా గణప సముద్రం సరస్సు వద్ద నిమజ్జనాలు
గణపురం, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): గణపురం మండలంలో గణేశ్ నవరాత్రి ఉత్సవాలు(Ganesh Navaratri Celebrations) ముగింపు సందర్భంగా బుధవారం గణపతి నిమజ్జనోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. మండలంలోని వివిధ గ్రామాలు, కాలనీల్లో ప్రతిష్ఠించిన వినాయక విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించిన వాహనాలపై ఊరేగింపుగా తరలించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి పాటలు, నృత్యాలతో సందడి చేశారు.
గణపతి బప్పా మోరియా.. వచ్చే ఏడాది మళ్లీ రావాలంటూ నినాదాలు చేస్తూ భక్తులు విగ్రహాలను నిమజ్జన ప్రదేశాలకు తరలించారు. యువత, మహిళలు, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. గణపసముద్రం సరస్సు వద్ద నిమజ్జన కార్యక్రమం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా గణపురం సిఐ కరుణాకర్ రావు ఎస్ఐ బొరగల అశోక్ తాసిల్దార్ అడ్లూరి రాజేశ్వరరావు ఎంపీడీవో శ్రీకాంత్ ల ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. సరస్సు వద్ద సింగరేణి రెస్యూ టీం ఫైర్ సిబ్బంది, సేవలు అందించగా అధికారులు అవసరమైన ఏర్పాట్లను పర్యవేక్షించారు. మండలంలోని చెరువులు, నిమజ్జన ప్రదేశాల వద్ద భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు.