ఘనంగా గణపతి పూజ
21-09-2026 | 07:46pm
మోతె, సెప్టెంబర్ 21 (విజయ క్రాంతి): మండల కేంద్రంలో సోమవారం కొత్త బస్ స్టాండ్ సెంటర్ (New Bus Stand Center)వద్ద ఎనిమిదోవ రోజు రెండు జంటలు కూర్చొని ఘనంగా గణపతి పూజలు నిర్వహించడం జరిగింది 16 మంది మహిళలు లక్షి దేవి చిత్ర పటానికి కుంకుమ పూజలు చేసి రంగు రంగుల పూలు సమర్పించారు. పాల కాయలు కొట్టి పులిహోర లు పెట్టి పాల పాయసం భక్తులకు పంచి పెట్టారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మెట్టు అలివేల నారాయణ రెడ్డి, అప్పల లక్ష్మయ్య మల్లేశ్వరి, సురకంటి లింగారెడ్డి నాగమ్మ, కొండూరు అంజయ్యప్రమీల, బొడ్డు రామచంద్రయ్య మంగమ్మ, సువర్ణ, అనిత, నాగమ్మ తదితరులు పాల్గొన్నారు.