ప్రశాంత వాతావరణంలో గణేష్ నిమజ్జనం నిర్వహించాలి
మండలంలోని మండప నిర్వాహకులకు కౌన్సిలింగ్ లో ఎస్ఐ రవికుమార్
ముత్తారం, సెప్టెంబర్ 21(విజయ క్రాంతి): గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని(Ganesh immersion ceremony) ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు ముత్తారం పోలీసుల ఆధ్వర్యంలో గణేష్ మండప నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నిమజ్జన ఊరేగింపులో పాటించాల్సిన భద్రతా చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణపై నిర్వాహకులకు పలు సూచనలు చేశారు.
నిమజ్జన ఊరేగింపు సందర్భంగా పోలీసుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని, ట్రాఫిక్కు ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలని సూచించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా క్రమశిక్షణతో వ్యవహరించాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
గణేష్ నిమజ్జనాన్ని ప్రశాంతంగా, సురక్షితంగా, సామరస్యపూర్వక వాతావరణంలో నిర్వహించేందుకు మండప నిర్వాహకులు పోలీసు శాఖకు పూర్తి సహకారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.