రూ.17లక్షలు పలికిన గణేష్ లడ్డు

23-09-2026 | 11:08pm

నారాయణఖేడ్, సెప్టెంబర్ 23: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండల పరిధిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పంచగమ్మలోని పంచలింగేశ్వర ఆలయం(Panchalingeshwara Temple)లో ప్రతిష్టించిన గణేష్ లడ్డు వేలం పాటలో రూ. 17,00,001 లకు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం మాచారం గ్రామానికి చెందిన భక్తుడు సంగమేశ్వర్ లడ్డును కైవసం చేసుకున్నాడు. నారాయణఖేడ్ ప్రాంతంలో భారీగా లడ్డు వేలం పాట పలకడంతో పలువురు గణేష్ భక్తులు, స్థానిక గ్రామస్తులు సంగమేశ్వర్ ను అభినందించారు. ఈ సందర్భంగా స్థానిక గణేష్ కమిటీని వివాహకులు ఆయనను ఘనంగా సన్మానించారు.

మరిన్ని వార్తలు