జీడీపీ వృద్ధి.. దేశాభివృద్ధి

01-10-2026 | 05:00am

భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి దాదాపు ఎనిమిది దశాబ్దాలు పూర్తి అవుతున్నా.. నేటికీ అభివృద్ధి చెందిన దేశంగా రూపాంతరం చెందలేదు.. సరికదా, దాదాపు 1980 వరకూ ‘ది హిందూ రేట్ ఆఫ్ గ్రోత్’ స్థితిలో అనగా ‘ఇండియా స్లో యాన్యుయల్ ఎకనమిక్ గ్రోత్ రేటు’లో కొనసాగింది. దేశానికి స్వాతంత్య్రం(independence) వచ్చిన తొలినాళ్లలో 3.5% జీడీపీ(GDP) నుంచి 1989 నాటికి కేవలం 0.5 శాతం పెరుగుదలతో 4%  వృద్ధిరేటు సాధించింది. దీనికి ప్రధాన కారణం అధిక జనాభా, తక్కువ తలసరి ఆదాయం.

మరి ముఖ్యంగా ‘లైసెన్స్ రాజ్’ విధానం వల్ల పరిశ్రమలు స్థాపన అంతంత మాత్రంగా ఉండటం, ఉద్యోగస్వామ్యంలో అలసత్వం (రెడ్ టేపిజం), పోటీతత్వం లేకపోవడం. అయితే గత మూడు దశాబ్దాలుగా జీడీపీ వృద్ధి పెరుగుతూ నేటికి 7.80% శాతం న మోదైనట్లు ఆర్థిక నివేదికలు చెప్తున్నాయి. ఈ ఎనిమిది దశాబ్దాల కాలంలో జీడీపీ ఈ స్థాయిలో పెరిగేందుకు దోహదం చేసి న అనేక పరిణామాలు పరిశీలించుకోవాలి.  2047 నాటికి వికసిత భారత్ ల క్ష్యంగా, అభివృద్ధి చెందిన దేశంగా భారత్ నిలబడేందుకు చేపట్టాల్సిన చర్యలనూ చర్చించుకోవాలి. 

పక్కా ‘ప్లానింగ్’తో ముందుకు..!

1947 నాటికి భారతదేశం ఆర్థిక వ్యవస్థను పరిశీలిస్తే.. చాలా బలహీన పరిస్థితి లో ఉంది. నాడు బ్రిటిష్ వారు విడిచిపెట్టిన అస్తవ్యస్తమైన పారిశ్రామిక విధానం, అతి తక్కువ పెట్టుబడితో ఏర్పాటు చేసిన పరిశ్రమలు, అల్ప ఉత్పాదకత, కొన్ని ప్రాంతాల్లో పరిమిత స్థాయిలో ఏర్పాటు చేసిన పరిశ్రమలు, మౌలిక సదుపాయా లు కొరత, కేవలం వ్యవసాయ రంగం మీద ఆధారపడే ఉద్యోగిత వల్ల దేశ ఆర్థిక ప్రగతి ఆపసోపాలు పడుతూ ఉంది.

పేదరికం, నిరక్షరాస్యత, అల్ప ఉపాధి, సామా జిక, ఆర్థిక అసమానతలు, అంతంత మాత్రంగానే ఉన్న రవాణా సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు కొరత, ఆరోగ్య, విద్యా రంగాల్లో వెనుకబాటు తనం వంటి పలు కారణాలు వలన ఆర్థిక అభివృద్ధి నామమాత్రంగా కొనసాగింది.

అటువంటి పరిస్థితుల్లో, నూతన భారతదేశ నిర్మాణానికి తొలితరం నాయకులు పటిష్టమైన చర్యలు చేపట్టేందుకు 1950లో ‘ప్లానింగ్ కమిషన్’ను  ఏర్పాటు చేశారు. మొదటి పంచవర్ష ప్రణాళిక 1951లో ప్రారంభించి, దేశంలో వ్యవసాయ రంగానికి, నీటి పారుదల సౌకర్యాల అభివృద్ధికి, కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌కు అధిక ప్రాధాన్యం ఇచ్చా రు. 1956లో రెండో పంచవర్ష ప్రణాళికలో పారిశ్రామిక రంగానికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు.

భారీ పరిశ్రమలు, ఇనుము ఉక్కు కర్మాగారాలు, పెద్ద ఎత్తున పబ్లిక్ సెక్టార్ రంగంలో భారీ ఇంజనీరింగ్, యంత్ర పరిశ్రమలు స్థాపన జరిగింది. దీంతో దేశంలో ఒక పక్క వ్యవసాయ రంగం అభివృద్ధికి, మరోవైపు పారిశ్రామిక అభివృ ద్ధికి బాటలు పడ్డాయి.  అయినా.. దాదాపు 1980 వరకూ దేశ జీడీపీ 3.5% నుంచి 4% శాతం మధ్యలోనే కొనసాగింది. అందుకే దాన్ని ‘హిందూ రేట్ ఆఫ్ గ్రోత్’ గా పరిగణిస్తారు. అంతమాత్రాన ఏమీ సాధించలేదని చెప్పడం పొరపాటు.  ఇదే సమయంలో మనదేశంలో ‘హరిత విప్ల వం’ ద్వారా వ్యవసాయ రంగంలో అద్భుతమైన ప్రగతి సాధించాం.

ఆహార ధాన్యాలు సమృద్ధిగా ఉత్పత్తి చేయడం ద్వారా విదేశాల నుంచి ఆహార ధాన్యాలు దిగుమతులు తగ్గాయి. భారీ పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. పబ్లిక్ రంగంలో అనేక పరిశ్రమలు వచ్చాయి. విద్యా రంగంలో ఐఐటీ, ఐఐఎం, సెంట్రల్ యూనివర్సిటీలు, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అందించే అనేక విద్యా సంస్థలు ఏర్పడ్డాయి. మౌలిక సౌకర్యాలు, రవాణా సౌకర్యాలు మెరుగుపడ్డాయి. అంతరిక్ష పరిశోధనలో ముందడుగు వేశాం.  

పీవీ హయాంలో గణనీయ మార్పులు

దేశ ఆర్థిక వ్యవస్థలో గణనీయమైన మార్పులు 1991లో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు, అప్పటి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి మన్మోహన్ సింగ్ హయాంలో ప్రారంభమయ్యాయి. వారి హయాంలో సరళీకరణ ఆర్థిక విధానాలు, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అమల్లోకి రావడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ, దేశ నిర్మాణం నూతన స్వరూపం సంతరించుకుంది. పారిశ్రామిక విధానం సులభతర మైంది. ప్రైవేటీకరణ, పోటీతత్వం జోరు అందుకోవడం ద్వారా దేశంలో చాలా రంగాల్లో వివిధ రకాల పరిశ్రమలు స్థాపితమయ్యాయి. పట్టణీకరణ పెరిగింది.. అక్ష రాస్యత పెరిగింది.  ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించడం వల్ల ఆర్థిక సామాజిక అభివృద్ధి సాధ్యమైంది.

ముఖ్యంగా 1990 నుంచి 2000 కాలంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సేవా రంగం అభివృద్ధి చెందడంతో బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, గురు గ్రాం, పుణె వంటి నగరాలు సాఫ్ట్‌వేర్ రం గానికి చిరునామాగా మారి, ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెంది, దేశ ఆర్థికరంగం అభివృద్ధిలో కీలక పాత్ర పోషించడం మొదలుపెట్టాయి. విదేశీ పెట్టుబడులు ఆకర్షించడానికి, విదేశీ ద్రవ్యం రాబట్టడానికి కారణం అవుతున్నాయి. ప్రతీ సంవత్సరం జీడీపీ వృద్ధి పెరుగుతూ వచ్చింది.

ప్రైవేటీకరణ ఊపందుకుంది.. బిలియనీర్ల సంఖ్య పెరగడం మొదలైంది.. జీడీపీ వృద్ధి రేటు లో వీరి పాత్ర కీలకంగా మారింది.  2008లో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాం ద్యం సంభవించినా, మన దేశం మాత్రం చాకచక్యంగా దాని ప్రభావం నుంచి బయటపడి, దేశ ఆర్థిక అభివృద్ధి కుంటుపడ కుండా నిలబడింది. తదుపరి కొన్ని సవా ళ్లు ఎదురైనా, బ్యాంకింగ్ రంగంలో ఒడుదుడుకులు, ద్రవ్యోల్బణం, అధిక ధరలు వంటి సమస్యలు ఏర్పడినా తట్టుకుంది. 

సంస్కరణలతో బలపడి నిలబడి..!

2014 లో కేంద్రంలో ఎన్డీయే అధికారంలోకి వచ్చాక.. ప్రైవేటీకరణను అనేక రంగాల్లో ప్రోత్సహించడం, పబ్లిక్ రంగం లో అనేక మార్పులు చేయడం, బ్యాంకింగ్ రంగంలోనూ సమూల మార్పులు తీసుకురావడం, మౌలిక సదుపాయాల కల్పన, రైలు, రోడ్లు మార్గాలు అభివృద్ధి, పోర్టులు, విమానాశ్రయాలు విస్తరణ, డిజిటల్ పేమెంట్స్, యూపీఐ చెల్లింపులు, ఆధార్ లింక్ సేవలు, జీఎస్టీ అమలు, పన్నుల వసూలు, టెక్నాలజీ అమలు, పారిశ్రామికీకరణ, స్టార్టప్‌లు, మేక్ ఇన్ ఇండియా, గతిశక్తి.. ఇలా పలు సంస్కరణలు, విధానాల ద్వారా ఆర్థిక వృద్ధి రోజు రోజుకు పెరుగుతూ వస్తున్నది.

అయితే గణనీయంగా పెరిగిన జీడీపీ పెద్ద నోట్ల రద్దు, మరి ముఖ్యంగా కరోనా ప్రభావంతో 2020లో లాక్ డౌన్ వంటి చర్యలు వల్ల తగ్గుముఖం పట్టింది. అయినప్పటికీ ప్రపంచంలోనే అతిపెద్ద నాలుగో ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలబడింది.  ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా భారత్ ఒక బలమైన ఆర్థిక శక్తిగా మారుతున్నది. దీనికి ప్రధాన కారణం మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా, సేవా రంగంలోనూ రాణించడం.

సంపద అందరికీ చేరితేనే..!

గత ఎనిమిది దశాబ్దాలుగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని 3.5% శాతం నుంచి ఇప్పుడు 7.8% శాతానికి జీడీపీ వృద్ధి సాధించిన మన దేశం.. ఈ వృద్ధి రేటును నిలబెట్టు కుంటూ, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న అనేక సవాళ్లను తట్టుకోవాల్సి ఉంది. ముఖ్యంగా వాతావరణ మార్పులు, వరదలు, భూకంపాలు, ప్రకృతి విపత్తులు, అమెరికా సుం కాలు, ఉగ్రవాద సమస్యలు, సరిహద్దు సమస్యలు, నిరుద్యోగం, పేదరికం, ద్రవ్యోల్బణం, అధిక ధరలు, ఎల్ నినో ప్రభావం, పశ్చిమాసియా సంక్షోభాలు వంటి ఎన్నో సమస్యలను ఎదుర్కోడానికి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.  ము ఖ్యంగా యువత, విద్యార్థుల ఆకాంక్షలకు తగ్గట్టు విధానాలు అమలు చేయాలి.

జెన్ జీ, జెన్ ఆల్ఫాను దృష్టిలో ఉంచుకునే నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం. దేశాభివృ ద్ధి, సంపద  కేవలం కొద్ది మంది బిలియనీర్ల చేతిలోనే కేంద్రీకృతం కాకుండా.. సా మాన్య, మధ్య తరగతి ప్రజలకు చేరడం ద్వారానే దేశం శాశ్వతంగా సుస్థిర ఆర్థిక సామాజిక అభివృద్ధితో ముందుకు సాగుతుంది. రైతులు, విద్యార్థులు, యువత, ఉ ద్యోగ, కార్మికుల శ్రేయస్సు దృష్టిలో ఉం చుకునే ప్రభుత్వాలు నిర్మాణాత్మక విధానాలు రూపొందించి అమలు చేయ డం ద్వారానే అతి త్వరలో రెండు అంకెల జీడీ పీ వృద్ధిరేటులో దేశం కొనసాగుతూ, అభివృద్ధి చెందిన దేశంగా విరాజిల్లుతుంది. 

వ్యాసకర్త ఫోన్ నెంబర్: 9390509791 

ఐ.ప్రసాదరావు

మరిన్ని వార్తలు