రాష్ట్ర స్థాయి క్రీడలకు జిల్లా బాలికల కబడ్డీ జట్టు ఎంపిక

03-10-2026 | 12:07am

ఆలేరు, అక్టోబర్ 2 (విజయక్రాంతి): యాదాద్రి-భువనగిరి జిల్లా కబడ్డీ(Kabaddi) అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం ఆలేరులోని ఫ్రెండ్స్ క్లబ్‌లో జిల్లా బాలికల కబడ్డీ జట్టు ఎంపికలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 100 మంది క్రీడాకారిణులు ఈ ఎంపికల్లో పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆలేరు PACS చైర్మన్ జనగామ ఉపేందర్ రెడ్డి మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని పురస్కరించుకుని వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి జట్టు ఎంపికలను ప్రారంభించారు.

ఎంపికైన క్రీడాకారిణులు ఈ నెల 10 నుంచి 12 వరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో జరగనున్న రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీ(State-Level Kabaddi Competition)ల్లో జిల్లా తరఫున పాల్గొననున్నారు. జిల్లా జట్టుకు ఎంపికైన వారిలో హైదరాబాద్ డిఫెన్స్ అకాడమీ విద్యార్థినులు శ్రీనిధి, హారిక ఉన్నారు. అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పూల నాగయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కోశాధికారి గంధమాల కుమార్, టెక్నికల్ కమిటీ చైర్మన్ సింగం విజయ్ కుమార్, అచ్చిన సురేందర్, మంగళగిరి నరేష్, సంగం రాకేష్, పల్లె రమేష్ రెడ్డి, సాత్విక, విజయలక్ష్మి, సంపత్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు